గగనతలంలో ఎలక్ట్రిక్‌ ప్లేన్‌ల సందడి  | Sakshi
Sakshi News home page

గగనతలంలో ఎలక్ట్రిక్‌ ప్లేన్‌ల సందడి 

Published Sun, Oct 1 2017 12:08 PM

electric planes within a decade  - Sakshi

న్యూయార్క్‌: పెరుగుతున్న వాయు కాలుష్యానికి చెక్‌ పెట్టడంతో పాటు ఇంధన ఖర్చులను ఆదా చేసేందుకు త్వరలో గగనతలంలో ఎలక్ట్రిక్‌ విమానాలు సందడి చేయనున్నాయి. మరో పదేళ్లలో పూర్తిస్థాయి ఎలక్ట్రిక్‌ కమర్షియల్‌ ప్లేన్‌లను అందుబాటులోకి తీసుకువచ్చేందుకు ఈజీజెట్‌ అమెరికన్‌ ఇంజనీరింగ్‌ స్టార్టప్‌తో కలిసి పనిచేస్తోంది. 335 మైళ్ల దూరం ప్రయాణించగల ఎయిర్‌క్రాఫ్ట్‌ను డిజైన్‌ చేయడంపై అమెరికాకు చెందిన రైట్‌ ఎలక్ట్రిక్‌ కసరత్తు ప్రారంభించింది. ఈజీజెట్‌ విమానాల్లో ఇప్పుడు ప్రయాణించే వారి సంఖ్యలో 20 శాతం మందిని చేరవేయగల సీటింగ్‌ కెపాసిటీతో ఈ ఎలక్ట్రిక్‌ ప్లెయిన్‌ను డిజైన్‌ చేస్తున్నారు.

వీటి కమర్షియల్‌ ఉత్పత్తులను వేగవంతం చేసేందుకు రైట్‌ ఎలక్ట్రిక్‌.. ఈజీజెట్‌తో కలిసి పనిచేస్తుంది. బ్యాటరీతో నడిచే విమానాలు ఇంధన వ్యయాలను తగ్గించడమే కాక, తక్కువ దూరాల ప్రయాణానికి అనువుగా ఉంటాయని, వాయు కాలుష్య నివారణకూ ఇవి ఉపకరిస్తాయని నిపుణులు చెబుతున్నారు. పర్యావరణంపై తక్కువ ప్రభావం చూపేలా ఎలక్ట్రిక్‌ టెక్నాలజీని అందుబాటులోకి తెచ్చేందుకు ప్రయత్నిస్తున్నామని, విమానయాన పరిశ్రమ సైతం ఎలక్ట్రిక్‌ బాట పట్టాల్సిన అవసరం ఉందని ఈజీజెట్‌ సీఈవో కార్లన్‌ మెకాల్‌ చెప్పారు.

Advertisement
Advertisement